telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరి కథకు నో చెప్పిన బన్నీ… అల ముందుకెళ్లిన విజయ్

puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఇద్దరూ కలిసి సొంత బ్యానర్‌పై ‘ఇస్మార్ట్ శంకర్’రూపంలో భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే జోష్‌లో ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీ కోసం ముందుగా అల్లు అర్జున్‌ని హీరోగా తీసుకోవాలని భావించారట పూరి, ఛార్మి. ఈ మేరకు ఆయనను సంప్రదించగా కొన్ని కారణాల వల్ల బన్నీ నో చెప్పారట. సీన్ రివర్స్ కావడంతో చివరకు విజయ్ దేవరకొండ ను ఫైనల్ చేశారని తెలిసింది. పూరి నేరేట్ చేసిన కథ నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారట విజయ్ దేవరకొండ. అలా సెట్స్ మీదకొచ్చిన ఈ మూవీ ఇటీవలే ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగమవుతుండటం విశేషం.

Related posts