telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏప్రిల్ 20 తనకెంతో స్పెషల్ అంటున్న మహేష్ బాబు

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తన ఫ్యామిలీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ అన్నింటిని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. ఏప్రిల్ 20 తనకెంతో స్పెషల్ డే అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు ఇవాళే. ఈ సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెలిపాడు మహేష్‌. సోషల్ మీడియా వేదికగా తన తల్లితో కలిసి దిగి మనసారా నవ్వుతున్న ఫోటోను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ ఇందిరా దేవి, మహేష్ బాబు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం జరిగిపోయింది. ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు అవుతుంది. సొంత మరదలినే కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు. అయితే విజయనిర్మలతో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఎలాంటి లోటూ లేకుండా చూసుకున్నారు.

Related posts