telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాంగోపాల్ వర్మ … కాంటెస్ట్… మీరు పార్టిసిపేట్ చేయొచ్చు…

Ram gopal Varma Fire Censor board

రాంగోపాల్ వర్మ మళ్ళీ తన పంధాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ప్రచారం ప్రారంభించాడు. ఏది చేసినా వింతగా చేసే ఆయన, ఈ చిత్ర ప్రచారం కూడా అలాగే చేస్తూపోతున్నాడు. ఇప్పటివరకు అందులో పాత్రలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ, దానికి కూడా సామజిక మాధ్యమాలలో అందరికి ఆసక్తిని రేపి మరీ విడుదల చేశాడు. మళ్ళీ ఏ పాత్రను గురించి చెప్పబోతున్నాడో, సామజిక మాధ్యమాలలో బాహుబలి చిత్రంలో ఒక సన్నివేశాన్ని మార్ఫింగ్ చేసి.. వాళ్లెవరో కనుక్కోమంటున్నాడు. సోషల్ మీడియాలో తాను చేసే వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ, కొత్త చర్చలకు తెరలేపే వర్మ ప్రచార అస్త్రం ఏమి తెలుపనుందో!

ఇటీవల ఈ సినిమాలోని ‘వెన్నుపోటు’ అనే పాటను విడుదల చేయగా, తెలుగుదేశం వర్గాల నుంచి తీవ్ర విమర్శలు సైతం వచ్చాయి. తాజాగా, ‘బాహుబ‌లి’ సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచిన పోస్టర్ ను కాస్త మార్పు చేసి, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, ఈ చిత్రంలో వ్యక్తులు ఎవరో గుర్తించేందుకు తనకు సాయం చేయాలని కోరారు. ఇందులో బాహుబలి ముఖం ఎన్టీఆర్ మాదిరిగా, కట్టప్ప ముఖం చంద్రబాబు మాదిరిగా కనిపిస్తోంది. తన కొత్త చిత్రంపై మరింత హైప్ ను పెంచేందుకే ఆయన ఈ పని చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమిలేదు. ఇంతకీ ఈ కాంటెస్ట్ ఉద్దేశ్యం ఏమిటో.. వేచి చూడాల్సిందే.

Related posts