telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కారు ఇంజిన్ నుంచి సౌండ్స్… ఏంటా అని చూసిన యజమానులకు షాక్…!

Cops’ 5-hour rescue operation for kitten trapped in car engine

ఆదివారం అమెరికాలోని బ్రూక్లిన్‌లోని మిడ్‌వుడ్‌లో నివాసముండే అనస్తాసియా కుల్చిస్ట్కాయ అనే పదహారేళ్ళ అమ్మాయి, ఆమె తల్లి ఒల్గాకు తమ అపార్ట్‌మెంట్ బయట తెల్లవారుజామున పిల్లి గట్టిగా అరవడం వినిపించింది. దాంతో తల్లికూతురు ఇద్దరు బయటకు వచ్చి చూశారు. అయితే వారికి కారు ఇంజిన్ నుంచి పిల్లి కూతలు వినిపించాయి. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా… పిల్లి ఇంజిన్‌లో చిక్కుకుని బయటకు రాలేకపోతుంది. తల్లికూతురు కొద్దిసేపు దాన్ని బయటకు తీసేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం అందుకుని వచ్చిన పోలీసులకు కారు ఇంజిన్‌లో చిక్కుకుని దాన్ని తల మాత్రం బయట కన్పిస్తున్న పిల్లి కన్పించింది. పోలిసుల ప్రయత్నం కూడా విఫలం కావడంతో వారు పోలీసులు అత్యవసర సేవా విభాగం వారికి కబురు పెట్టారు. వారి సహాయంతో 5 గంటలు శ్రమించిన పోలీసులు చివరకు పిల్లిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. అలా ప్రాణాలతో బయటపడిన పిల్లిని వెంటనే తల్లికూతురు దానికి అంటుకున్న ఆయిల్ మరకలను శుభ్రంచేసి ఆహారం పెట్టారు. అనంతరం ఆ పిల్లికి ఫెలిక్స్ అని పేరు పెట్టిన ఒల్గా దాన్ని తామే పెంచుకుంటామని చెప్పారు. అయితే ఎవరో కావాలనే ఇలా పిల్లిని కారు ఇంజిన్‌లో ఇరికించి ఉంటారని రెస్క్యూ ఆపరేషన్ తరువాత ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

Related posts