telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల..వైకుంఠపురములో : “సామజవరగమన” మెలోడీ సాంగ్

AA19

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం “అల..వైకుంఠపురములో”. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. ఇటీవ‌ల‌ చిత్రం నుండి పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో బ‌న్నీ కారు ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చొని సిగ‌రెట్ అంటించుకుంటున్నాడు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మెలోడి సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. “సామజవరగమన” అంటూ సాగే ఈ పాట వింటుంటే థ‌మ‌న్ కూల్ నెస్, సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి సిద్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్ కూడా కలగలిసి అద్భుతహా అనిపించింది. త్వ‌ర‌లోనే ఫుల్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts