telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముగ్గురు టాలీవుడ్ మేనేజర్ల పిల్లలకు హార్ట్ సర్జరీ… సోనూసూద్ సాయం

Sonusood

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న చాలా మందిని ఆదుకున్నారు. చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు కూడా చేయిస్తానని ఇటీవల ప్రకటించిన సోనూ.. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు సర్జరీలు చేయించారు. అయితే ఈ చిన్నారుల్లో టాలీవుడ్ మేనేజర్లకు చెందిన పిల్లలు కూడా ఉండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో మేనేజర్‌గా పని చేస్తున్న ఎంవీ సుబ్బారావు తన రెండేళ్ల కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని సోనూ సూద్‌కు ట్వీట్ చేశారు. తన బాబుకి వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారని, సర్జరీకి సరిపడ డబ్బు తన వద్ద లేదని, దయచేసి తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌ను వేడుకున్నారు. సుబ్బారావు ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్ “బుధవారం మీ బాబుకి పరీక్షలు నిర్వహిస్తారు. గురువారం ముంబైలోని ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో మీ బాబుని చేర్చుకుంటారు. సర్జరీ నిర్వహిస్తారు” అని అభయమిచ్చారు. ఇదేవిధంగా మరో ఇద్దరు టాలీవుడ్ మేనేజర్ల చిన్నారులకు కూడా ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ హాస్పిటల్‌లో సోనూసూద్ శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్టు తెలిసింది. బయట ప్రజలనే కాకుండా తాను పని చేస్తున్న ఇండస్ట్రీలో ఉన్న వారిని కూడా సోనూసూద్ ఈ విధంగా ఆదుకోవడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts