telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి పుట్టినరోజు… ప్రముఖుల విషెస్

Rajamouli

దర్శక ధీరుడు, “బాహుబలి”తో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్”తో బిజీగా వున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు (గురువారం) రాజమౌళి జన్మదినోత్సవం. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజమౌళికి విషెస్ తెలియజేసారు.

హ్యాపీ బర్త్ డే రాజమౌళిగారు. ఇలాగే సినీ పరిశ్రమలో ఉన్న దర్శకులకు మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా – మహేష్ బాబు

జన్మదినోత్సవ శుభాకాంక్షలు రాజమౌళిగారు. మీరు ఎప్పుడూ ఇలాగే హద్దులు చెరిపేస్తూ ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు నిర్దేశించాలి – రామ్ చరణ్

మా కెప్టెన్ రాజమౌళిగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఎల్లప్పుడూ ఆదర్శనీయం – రానా

సినీ మాంత్రికుడు, భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా సెల్యూట్ – కరణ్ జోహార్

భారతీయ సినిమా గర్వంగా చెప్పుకునే రాజమౌళికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు – మెహర్ రమేష్

Related posts