telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాధేశ్యామ్” స్టోరీ లైన్ ఇదే…!

Radheshyam

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుసగా విడుదలవుతున్న “రాధేశ్యామ్”‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. పూజ కూడా తన అందంతో అందరిని మరోసారి ఆకట్టుకుంది. అయితే అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని చాలా మంది అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే కన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్‌ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనన్నుట్లు సచిన్‌ కేడ్కర్‌ తెలిపారు.

Related posts