telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టక్ జగదీష్” కోసం తమన్ అదిరిపోయే సాంగ్స్

Thaman

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల అరవింద సమేత, అలవైకుంఠపురంలో లాంటి సినిమాల్లో తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. ప్రస్తుతం “టక్‌ జగదీష్”‌ ప్రాజెక్టుకు సరిపోయే మంచి ఆల్బమ్‌ను సిద్దం చేసినట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. జులై తొలి వారం నుంచి సినిమా మేజర్‌ షెడ్యూల్‌ షురూ చేయనున్నారట చిత్రయూనిట్. కరోనా లాక్‌డౌన్‌కు ముందే ఈ మూవీ 60 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

Related posts