telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్ధ్రరాత్రి హీరోయిన్ కు ట్యాక్సీ డ్రైవర్ వేధింపులు

Mimi-Chakravarthi

బెంగాలీ హీరోయిన్, లోక్‌సభ ఎంపీ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాత్రి కారుతో వెళ్తున్న ఆమెను ఓ ట్యాక్రీ డ్రైవర్ వెంటపడి వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌కతా నగరంలోని బలీగుంగే ఫారీ ప్రాంతంలో జరిగింది. మిమి చక్రవర్తి ఇటీవల మహిషాసుర మర్దిని అనే షోలో కనిపించారు. బెంగాళీ దర్శకుడు కమలేశ్వర్ రూపొందించిన ఈ షో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే మిమిని ఉద్దేశించి టాక్సీ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలోనే అతడికి చీవాట్లు పెట్టిన నటి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మిమి చక్రవర్తి స్పందిస్తూ.. 14వ తేదీ రాత్రి 1.30 గంటల సమయంలో గరియాహాట్ రోడ్ నుంచి బల్లీగుంజే ఫన్ని వైపు కారులో వెళ్తుండగా ఓ ట్యాక్సీ డ్రైవర్ నన్ను ఫాలో అయ్యాడు. గరియాహట్ క్రాసింగ్ వద్ద నన్ను వేధిస్తూ దుర్భాషలాడాడు. అతడి బారి నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని దేబా యాదవ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

Related posts