telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ డాన్స్ మూవ్‌మెంట్స్ చూసి బెదిరిపోయాను… వాణి కపూర్

Vani

హృతిక్ డాన్స్ మూవ్‌మెంట్స్ చూసి బెదిరిపోయాను అంటోంది బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కల్యాణం’ సినిమాలో నటించిన వాణి కపూర్ ఆ తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించింది. రణ్‌వీర్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి హీరోల సరసన నటించింది. ఇక గతేడాది బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి మెప్పించింది. ఆ సినిమాలో హృతిక్‌తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన ‘ఘాంగ్రూ’ సాంగ్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట గురించి తాజాగా వాణి స్పందించింది. ‘హృతిక్‌తో డ్యాన్స్ అంటేనే భయపడ్డాను. ఆ పాటలో హృతిక్ మూవ్‌మెంట్స్ చూసి బెదిరిపోయాను. ఆ పాటలో నన్ను లేకుండా చేయమని కొరియోగ్రాఫర్‌ను వేడుకున్నాను. కానీ, కుదరలేదు. ఆ పాటలో ఓ స్టెప్ నన్ను చాలా ఒత్తిడికి గురి చేసింది. ఎలాగో కష్టపడి చేశాను. నా డ్యాన్స్‌కు వచ్చిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను’ అని వాణి చెప్పింది.

Related posts