telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ డౌన్ తరువాత విడుదలకానున్న మొదటి చిత్రం ఇదే…!

PMN

ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “పీఎం నరేంద్ర మోదీ”. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ మోదీ పాత్ర పోషిస్తున్నారు. మేరీకోమ్‌, సరబ్‌జిత్‌ వంటి చిత్రాలు తీసిన ఒముంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. మోదీ రాజకీయ జీవితం ఆరంభమైనప్పటి నుంచి 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకూ అనేక అంశాలు, విశేషాలు సినిమాలో ఉంటాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ సినిమాను మే 24న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కరోనా వల్ల అది కుదరలేదు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు విడుదలకు నోచుకోలేదు. ఓటీటీలో విడుదల చేయడానికి సినీ యూనిట్ సుముఖంగా లేదు. ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరవడానికి అనుమతులు రావడంతో చివరకు ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రనిర్మాతలు. లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా ఇదేనంటూ ఈ చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ నెల 15నే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.

Related posts