“భాగమతి” చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అనుష్క నటిస్తున్న తాజా చిత్రం “సైలెన్స్”. ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించనుండగా, అంజలి, షాలినిపాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగులో ఈ చిత్రం “నిశ్శబ్దం” పేరుతో విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. చిత్రంలో అనుష్క.. సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం అనుష్క పెయింటింగ్ నేర్చుకోవడంతో పాటు అందమైన పెయింటింగ్స్ కూడా వేసిందని తాజా సమాచారం. చిత్ర నిర్మాత కోన వెంకట్ మూవీ ప్రమోషన్ సమయంలో అనుష్క వేసిన కళాకృతులని ప్రదర్శించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
previous post
“బిగ్ బాస్”పై గీతా మాధురి కామెంట్స్