telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త బిజినెస్ లోని సమంత ఎంట్రీ

Samantha

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌ల‌కు దూరంగా ఉంటున్న సినీ తార‌లంద‌రూ సోష‌ల్ మీడియాలో వారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల‌కు మాత్రం ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో వారు చేస్తున్న ప‌నులు, నేర్చుకుంటోన్న కొత్త విష‌యాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు‌. ఇక అక్కినేని కోడలు సమంత ఇంటి టెర్ర‌స్ మీద వెజిట‌బుల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాదు సమంత ఇప్పుడు సినిమాల‌తో పాటు వ్యాపార రంగంపై కూడా దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్‌లో స్నేహితుల‌తో క‌లిసి ఏక్కం అనే ప్రీ స్కూల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన స‌మంత త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల వ‌స్త్రాల‌కు సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. ‘సాకి వ‌ర‌ల్డ్’(Saaki World) పేరుతో తాను దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు స‌మంత తెలిపారు. కొన్ని నెల‌లుగా సాకి వర‌ల్డ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని.. నా జర్నీలో ఫ్యాషన్‌పై నాకున్న ప్రేమ‌ను సాకి వ‌ర‌ల్డ్ తెలియ‌జేస్తుంద‌ని సామ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా షేర్ చేసిన వీడియోలో ఫ్యాషన్‌ దుస్తులకు సంబంధించి డిజైన్స్‌ని దగ్గరుండి తయారు చేయిస్తూ కనిపించారు సమంత.

Related posts