చిరంజీవి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దమెగాస్టార్ ర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతి అక్రమాలపై సినిమా ఉంటుందని, నక్సలిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందని వార్తలు వినపడ్డాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్ ఒకటి నెట్టింట్లో లీకైంది. ఈ లుక్‌లో మెడలో ఎర్రటి కండువాతో చిరంజీవి కాస్త వయసుతగ్గి కనిపిస్తున్నారు. లీక్డ్ లుక్ అయినా ఫ్యాన్స్ బాస్ సూపర్‌గా ఉన్నాడు అంటూ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ లేదా మరెవరైనా ప్రముఖ హీరో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. ‘ఆచార్య’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది.
previous post