telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీనీ టార్గెట్ చేసేందుకు ఉగ్ర సంస్థ స్కెచ్ .. ఇంటెలిజెన్స్ హెచ్చరిక!

narendra-modi

జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కలిపించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం కాశ్మీర్ లో ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేయడం వంటి చర్యలతో పాకిస్థాన్, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు రగిలిపోతున్నారు.

భారత్ పై ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సహకారంతో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ భారీ దాడికి ప్రణాళికలు రచిస్తోందని తెలిపింది. ఏకంగా ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను జైషే మొహమ్మద్ టార్గెట్ చేసిందని వెల్లడించింది.

Related posts