telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ 75వ చిత్రం ?

Venkatesh

విక్టరీ వెంకటేష్ ఇప్పటికి 73 సినిమాలు చేశారు. వెంకీ హీరోగా ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న ‘నారప్ప’ 74వ చిత్రం. ఈ క్రమంలో ఆ తర్వాత నటించే 75వ చిత్రం గురించి గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వెంకీ నటించే ఈ మైల్ స్టోన్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన కథకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తన స్టయిల్‌లో త్రివిక్రమ్ ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts