ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రజనీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో నటిస్తున్న సమయంలో చిన్న చిన్న గాయాలయ్యాయంటూ ఓ వార్త వైరల్ అయింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై రజనీ వివరణ ఇచ్చారు.
చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, చెట్టుకొమ్మలు మాత్రం చేతులపై అక్కడక్కడ గీసుకున్నాయని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ కార్యక్రమంలో నటించడం మంచి అనుభవాన్నిచ్చిందని రజనీ చెప్పారు.