ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ సామాజిక బాధ్యతతో ఓ ప్రమాదకర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే ఎన్నో అంశాలపై బాధ్యత గల పౌరుడిగా ఆయన స్పందించారు. తాజాగా ఓ ప్రమాదకర అంశాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంలో నిత్యం వేలాదిమంది ప్రయాణించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్ అయి ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్‌కు తెలియజేస్తూ సంబంధిత ఫొటోలను కూడా కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.
జగన్ ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు: చంద్రబాబు