telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్టికల్ 15″ను నిలిపేయాలంటూ బ్రాహ్మ‌ణ స‌మాజం పిటిషన్… కేసును కొట్టేసిన ధర్మాసనం

Article-15

2014లో యూపీలో ఇద్ద‌రు ద‌ళిత అమ్మాయిల‌ను రేప్ చేసి హ‌త్య చేశారు. ఆ ఘ‌ట‌న నేప‌థ్యంతో రూపొందిన సినిమా “ఆర్టిక‌ల్ 15”. ఆయుష్మాన్ ఖురాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యూపీలో ఉన్న కుల‌వ్య‌వ‌స్థ‌, పోలీసింగ్ గురించి కూడా ఈ సినిమాలో సాహ‌సోపేతంగా చిత్రీక‌రించారు. అయితే ఈ సినిమాలో బ్ర‌హ్మాణ స‌మాజానికి కించ‌ప‌రిచే విధంగా స‌న్నివేశాలు ఉన్నాయంటూ బ్ర‌హ్మాణ స‌మాజ్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తున్న‌ది. అందుకే “ఆర్టిక‌ల్ 15” సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపేయాల‌ని సుప్రీంకోర్టులో బ్రాహ్మ‌ణ స‌మాజం(బీఎస్ఓఐ) ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. సినిమా టైటిల్‌ను మార్చాల‌ని బ్ర‌హ్మాణ స‌మాజం త‌న పిటిష‌న్‌లో డిమాండ్ చేసింది. అయితే ఆ పిటిష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుప్రీం ధ‌ర్మాస‌నంలో ఎస్ఏ బోడే, బీఆర్ గావియా ఉన్నారు. టైటిల్ మార్పు విష‌యంలో సంబంధిత అధికారుల్ని ఆశ్ర‌యించాల‌ని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. అడ్వ‌కేట్ అర‌వింద్ కుమార్ తివారీ, రంజ‌న్ ద్వివేదీలు ఈ పిటిష‌న్ ఫైల్ చేశారు. సినిమా టైటిల్ వ‌ల్ల భార‌త రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 15పై త‌ప్పుడు అభిప్రాయాలు క‌లుగుతాయ‌ని వారు త‌మ‌ పిటిష‌న్‌లో వాదించారు. ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా రాజ్యాంగంలోని టైటిళ్ల‌ను ఎలా వాడుకుంటార‌ని అడ్వ‌కేట్లు ప్ర‌శ్నించారు. సినిమాను వాస్త‌వ క‌థ‌గా చెప్పుకుంటున్నార‌ని, కానీ వాస్త‌వాల‌కు భిన్నంగా సినిమా ఉంద‌ని బ్రాహ్మాణ స‌మాజం త‌న పిటిష‌న్‌లో తెలిపింది.

Related posts