telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ హాలీవుడ్ నటికి కరోనా వైరస్ పాజిటివ్

olga

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో ఆదివారం మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 65కి చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. వీరిలో ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ ఓల్గా కురిలెంకో కూడా ఉన్నారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఓల్గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంట్లోనే ఉన్నాను. వాస్తవానికి వారం రోజులుగా నేను అనారోగ్యంతో ఉన్నాను. జ్వరం, ఆయాసం లక్షణాలు నాలో ఉన్నాయి. మీరు జాగ్రత్త పాటించండి. దీన్ని సీరియస్‌గా తీసుకోండి’’ అని ఈ 40 ఏళ్ల ఉక్రెయిన్ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తన ఉక్రెయిన్ ఫ్యాన్స్‌కు అర్థమయ్యేలా ఆ భాషలో కూడా రాశారు. దీంతో ఓల్గా త్వరగా కోలుకోవాలని ఆమె స్నేహితులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఓల్గాకు నాలుగేళ్ల కుమారుడు అలెగ్జాండర్ ఉన్నాడు.

Related posts