telugu navyamedia
వార్తలు సామాజిక

శ్రామిక్ రైళ్ల ద్వారా 80 వేల మంది స్వస్థలాలకు!

10 winter trains between jaipur-renigunta

లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తోంది. ఇందులో భాగంగా వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను . ఐదు రోజుల క్రితం తరలింపు ప్రక్రియను ప్రారంభించిన రైల్వే ఇప్పటి వరకు దాదాపు 80 వేల మందిని స్వస్థలాలకు చేర్చినట్టు తెలిపింది. సోమవారం నాటికి 55 రైళ్లు గమ్యస్థానానికి చేరుకున్నట్టు పేర్కొంది.

బెంగళూరు, సూరత్, సబర్మతి, జలంధర్, కోటా, ఎర్నాకులం సహా పలు ప్రధాన నగరాల్లోని స్టేషన్‌ల నుంచి నిన్న మరో 30 రైళ్లు వలస కార్మికులతో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు వివరించింది. ఒక్కో రైలులో కనీసం వెయ్యిమంది ప్రయాణికులు ఉన్నట్టు వివరించింది. ఆయా రాష్ట్రాల డిమాండ్ మేరకే శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొంది.

Related posts