telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

దిగివస్తున్న .. బంగారం ధరలు…

gold and silver prices in markets

గత వారం రోజులుగా పెరుగుదల నమోదు చేసుకున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. బంగారం ధరలు ఒక రోజు భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. ఈరోజు దారుణంగా తగ్గింది. ఇప్పటికే సామాన్యుడికి బహు దూరమైనా బంగారం ధర నేడు భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల తగ్గుదలతో 42,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల తగ్గుదలతో 38,680 రూపాయలకు చేరింది.

బంగారం కంటే వెండి మరింతగా తగ్గుదలను నమోదు చేసుకుంది. దీంతో కేజీ వెండి ధర 70 రూపాయిలు తగ్గుదలతో 49,530 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

Related posts