telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డ్రగ్ టెస్టులో పాస్ కావడానికి ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే…!

Women

జూలీ మిల్లర్ (40) అనే మహిళ ఓ కేసులో నిందితురాలు. దీంతో ఆమె పోలీసుల పర్యవేక్షణలో ఉంది. సోమవారం ప్రొబేషన్ విజిట్ షెడ్యూల్ ప్రకారం జూలీని పైన్‌విల్లే పోలీస్ అధికారులు డ్రగ్ టెస్టు కోసం మూత్రం ఇవ్వాల్సిందిగా అడిగారు. అయితే, ఆమె మెథాంఫేటమిన్, సుబాక్సోన్ (పెయిన్ కిల్లర్) అనే మందులు వాడి ఉండడంతో తాను డ్రగ్ టెస్టు ఫెయిల్ అవుతానని భావించింది. దాంతో డ్రగ్ టెస్టు పాస్ కావడానికి తన యూరిన్ బదులు ఆమె పెంచుకుంటున్న కుక్క ముత్రాన్ని అధికారులకు ఇచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు జూలీని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. డ్రగ్ టెస్టులో పాస్ కావడానికి తన యూరిన్‌కు బదులు శునకం ముత్రాన్ని ఇచ్చానని తెలిపింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి బెల్ కౌంటీ నిర్బంధ కేంద్రానికి తరలించారు.

Related posts