telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ “క్లైమాక్స్” టీజర్

climax

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ )పేరుతో షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. ఆయనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మరోసారి శృంగార తార మియా మాల్కోవాతో కలిసి ఫిలిమ్ తీస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఈ మూవీకి “క్లైమాక్స్” అనే పేరు పెట్టారు. కొన్ని రోజులుగా ఆయన కరోనాపై వెటకారంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్చపర్చారు. ‘కరోనా శాపం, లాక్‌డౌన్‌ ఆశీర్వాదంతో నేను, మియా మాల్కోవా కలిసి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు క్లైమాక్స్ టీజర్ విడుదల చేస్తున్నాం’ అని వర్మ ప్రకటించారు. ఆయన ప్రకటించిన విధంగానే సాయంత్రం 5 గంటలకు “క్లైమాక్స్” టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో హాట్ సీన్స్ ఉండడమే కాదు సస్పెన్స్ కూడా ఉంది. టీజర్ చూస్తుంటే “క్లైమాక్స్” ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం అన్పిస్తోంది. ఇక “క్లైమాక్స్” ట్రైలర్ మే 18న ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts