ఇండోనేషియాలోని బాలిలో ఓ మారుమూల గ్రామంలో రెండు తలల పాము కనిపించింది. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఈ పాము కనిపించడంతో దాన్ని ఊరికి తీసుకొచ్చాడు. దీంతో పామును చూడడానికి స్థానికులు ఎగబడ్డారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న పాముకు రెండు తలలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, అది విషపూరితమైన సర్పమా? లేక మాములు పామా? అనేది తెలియాల్సి ఉంది. రెండు తలలతో వింతగా ఉన్న ఈ పామును చూసేందుకు అక్కడి స్థానికులు భారీగా తరలి వచ్చారు. పాము చుట్టూ చేరిన కొందరు పిల్లలు దాన్ని అరటి ఆకులో ఉంచి కొన్ని ఆహార పదార్థాలను అందించడం వీడియోలో ఉంది. ఇక నిపుణులు చెబుతున్న ప్రకారం రెండు తలల పాములు అనేవి చాలా అరుదుగా ఉంటాయట. ఒకవేళ ఉన్న వాటిని నిర్బంధ ప్రదేశాల్లో ఉంచి పెంచడం జరుగుతుందని వారి వాదన. ప్రస్తుతం ఈ అరుదైన రెండు తలల పాము వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
previous post
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ