telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మ్యాచ్ ఫీజు లేకుండానే .. ఆడతాం .. : జింబాబ్వే క్రికెటర్ లు

icc shocking decision on zimbabwe team

తమ దేశంలో ఎలాగైనా క్రికెట్ ను బతికించుకోడానికి జింబాబ్వే క్రికెటర్ లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము ఒక్క రూపాయి కూడా మ్యాచ్ ఫీజు తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్ లు ఆడతామని అంటున్నారు. ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్ వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు వేల ఇరవై టీ ట్వంటీ ప్రపంచకప్ సందర్భంగా ఆగస్టులో మహిళల క్వాలిఫయర్స్ ,ఆక్టోబర్ లో పురుషుల క్వాలిఫైయర్స్ మ్యాచ్ లున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశంలో క్రికెట్ ను బతికించుకునేందుకు జింబాబ్వే క్రికెటర్ లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు,ఇందులో భాగంగానే మ్యాచ్ ఫీజులు ఇవ్వకున్నా కూడా ఆడేందుకు సిద్ధమని తెలిపారు. ఇదే విషయాన్నీ ఆటగాళ్లు జింబాంబ్వే క్రీడల శాఖ మంత్రి కి కూడా చెప్పారట.

గత రెండు నెలలుగా పురుషులు, మహిళల జట్లకు జింబాబ్వే బోర్డు మ్యాచ్ ఫీజు చెల్లించడం లేదు ఇక సస్పెన్షన్ కారణంగా ఐసీసీ నుంచి కూడా జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు అందడం లేదు. ఐసీసీ సస్పెన్షన్ విధించిన ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుకునేందుకు అనుమతిచ్చింది అయినా కూడా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్లతో సెప్టెంబర్ లో జరగాల్సిన టీట్వంటీ ట్రై సిరీస్ లో తమ ఆటగాళ్లు పాల్గొనబోరని జింబాబ్వే క్రికెట్ బోర్డు పేర్కొంది. మరోవైపు అక్టోబర్ లో జరిగే ఐసీసీ సమావేశంలో జింబాబ్వే సస్పెన్షన్ పై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొద్ది రోజుల కిందట జరిగిన జింబాబ్వే క్రికెట్ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకోవటమే దీనికి కారణమని అంటున్నారు. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని మొత్తం బోర్డును రద్దు చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు జింబాబ్వే క్రికెట్ బోర్డు స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్స్ సంస్థ ఆధీనంలో ఉంటుంది

Related posts