telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … పనులు విజయవంతం.. ప్రయాణాలలో జాగర్తలు అవసరం…

today rasi falalu

మేషం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

వృషభం : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, చిరాకుగా కాని ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసి విహారయాత్రకు వెళతారు. మీ ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. వాహనాలు నడిటప్పుడు జాగ్రత్త అవసరం. మీ తోబుట్టినవారి సహాయసహకారాలు అందుకుంటారు.

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చు పై బడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

సింహం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరుగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

తుల : ఈ రోజు అన్ని విషయాల్లో మీది పై చేయిగా ఉంటుంది. పోటీ ల్లో విజయం సాధిస్తారు. మీ స్నేహితులతో కలిసి వినోద కార్యకమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ బంధువులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలువటానికి అలాగే ముఖ్యమైన ఒప్పండాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

ధనుస్సు : ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మకరం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కుంభం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంలో లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

మీనం : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Related posts