వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్2. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అనిల్ రావిపుడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో అనిల్‌కు మంచి పేరు వచ్చింది. దాని తరవుత మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం లాక్‌డౌన్ సమయంలో అనిల్ ఎఫ్2కు సీక్వెల్‌ను సిద్దం చేశాడని, దానిని ఎఫ్3గా తెరకెక్కించనున్నారిన వార్తలు వచ్చాయి. తరువాత నిర్మాత దిల్ రాజు వాటిని నిజం చేస్తూ మాట్లాడారు. ఈ సినిమా కొత్త కథాంశంతో తెరకెక్కనుందని కూడా తెలిపారు. అయితే నేడు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగి ఎఫ్3 పోస్టర్‌ను విడుదల చేసి సినిమాకు అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడిది 2021లో ప్రారంభం కానుంది. ఇందులో వెంకీమామ, వరుణ్ తేజ్‌లు డబ్బుల కట్టలు పోగేసుకొని పరుగుతు తీస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇందులో కూడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉంటాయని కానీ పోస్టర్ తెలుపుతుంది. మరి ఈ సినిమాలో ఏరేంజ్‌లో ఫన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తారనేది వేచి చూడాలి.
previous post