telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన ప్రదీప్

Pradeep

ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు కొద్ది రోజులుగా షూటింగ్‌లకు కాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్ధితిపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. ప్రదీప్‌కు యాక్సిడెంట్‌ అయ్యిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు కూడా ప్రచారమయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రదీప్‌ స్పందించాడు. గురువారం తన సోషల్ మీడియా పేజ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. కొంతకాలంగా తనపై, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గురించి ఆలోచించి తనకు మెసేజ్‌లు, ఫోన్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రదీప్‌. అయితే మీడియాలో వస్తున్నట్టుగా ప్రదీప్‌ ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కేవలం షూటింగ్‌లో జరిగిన చిన్న సంఘటనలో ప్రదీప్‌ కాలికి గాయమైంది. ఆ తరువాత కూడా షూటింగ్‌లు కొనసాగించటంతో ఆ గాయం తీవ్రమై రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు నెల రోజుల పాటు ప్రదీప్‌ను నిలుచోవద్దని సూచించారు.దీంతో నెల రోజుల పాటు బెడ్‌కే పరిమితమైన ప్రదీప్‌ షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానన్న ప్రదీప్‌, మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపాడు. అయితే తనపై వచ్చిన నెగెటివ్‌ వార్తల విషయంలో కూడా హుందాగా స్పందించిన ప్రదీప్‌ను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఢీ జోడి లాంటి షోస్‌ చేస్తున్నాడు.

Related posts