telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమ్ముడికంటే బావ బెటర్ అంటున్న మెగా డాటర్…

bunny-charan

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రామ్ చరణ్ సోదరి సుస్మిత కొణిదెల. మా తమ్ముడు రామ్ చరణ్ కంటే బావ అల్లు అర్జునే బెటర్ డ్యాన్సర్ అంటూ ప్రశంసించింది సుస్మిత. టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ జనరేషన్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లే.. వీళ్లల్లో ఎవరు బెస్ట్ అంటే మాత్రం చెప్పలేం.. కానీ, చరణ్ సోదరి సుస్మిత మాత్రం రెండో ఆలోచన లేకుండా జవాబు చెప్పేయడం విశేషం. చెర్రీ, బన్నీ ఇద్దరిలో స్టైలిష్ స్టార్ బెటర్ డ్యాన్సర్ అంటూ కొనియాడారామె. బన్నీ అండ్ చెర్రీ. ఈ ఇద్దరు కూడా డ్యాన్సుల షయంలో సూపర్ అనే చెప్పాలి. కానీ, వీళ్లలో ఎవరు బెటర్. ఈ క్వశ్చన్‌కి అంత ఈజీగా ఆన్సర్ ఇవ్వలేం. అయితే, చరణ్ సోదరి సుస్మిత మాత్రం రెండో ఆలోచన లేకుండా జవాబు చెప్పేసింది. అలాగే చరణ్ ఏ మెగా రీమేక్ చేస్తే బావుంటుంది అని అడగ్గా.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మెగా పవర్ స్టార్ చేస్తే చూడాలని ఉందని చెప్పారు. ఈతరం జగదేకవీరుని సరసన నిన్నటి తరం అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించాలని కూడా సుస్మిత చెప్పారు.

Related posts