telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

షాకింగ్‌ : గర్భవతి రాకుండా… పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

baby

ప్రస్తుత కాలంలో పిల్లలు పుట్టడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. కొందరైతే.. పిల్లలు కావడం లేదని.. భర్యలకు విడాకులు ఇస్తారు. అయితే.. అమెరికాలో ఓ వింత చోటుచేసుకుంది. అసలు భార్యభర్తలు ఎలాంటి కష్టం లేకుండా ఓ బిడ్డను కానేశారు. ప్రెగ్నెంట్‌ అయిన విషయం తెలియకుండానే ఓ లేడీ మగ బిడ్డకు జన్మనిచ్చింది. బోస్టర్‌ నగరానికి చెందిన 38 ఏళ్ల మెలిస్సా సర్జ్‌ కాఫ్‌కు గత నెల 8న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి బాత్రూంలోకి వెళ్లింది. అనంతరం బాత్రూంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె షాకయ్యింది. తాను గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని.. కొన్ని నెలలుగా రుతుస్రావం కాలేదని మెలిస్సా తెలిపింది. పొట్ట పరిమాణం కూడా పెరగలేదని… అందుకే ప్రెగ్నెంట్‌ అయిన విషయాన్ని గుర్తించకలేకపోయినట్లు చెప్పారు ఆమె. మార్చిన 8న నొప్పులు వచ్చాయని, వాటిని కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా తొలుత భావించినట్లు వెల్లడించారు. అయితే… జననాంగాల నుంచి మాంసం ముద్ద బయటకు రావడంతో ఏదో అవయవం తన శరీరం నుంచి బయటికి వస్తోందని అనిపించిందన్నారు. చివరికి తన భర్త అసలు విషయం చెప్పాడని మెలిస్సా సర్జ్‌కాఫ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Related posts