telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కొత్త వైరస్‌గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు..

తెలంగాణ లో శరవేగంగా కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తున్నది. దీనికి ఎన్440కే రకంగా నామకరణం చేసారు శాస్త్రవేత్తలు. కొత్త రకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం కూడా ఉందని గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎన్440కే ఉన్నట్టు గుర్తించగా..
నోయిడాలో ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసు వెలుగు చూసింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో వెలుగులోకి కొత్త విషయాలు వచ్చాయి. భారతదేశంలో 6,370 జీనోమ్ విశ్లేషణ జరపగా, 2% లో ఎన్440కే రకం మ్యుటేషన్ గుర్తించారు. జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఆవిర్భవించింది ఈ ఎన్440కే రకం కరోనా వైరస్. దేశవ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లో 2,40,000 జీనోమ్స్ విశ్లేషణలో 126 రకాల మ్యుటేషన్లకు కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారతదేశంలో యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణాలు కలిగిన మ్యుటేషన్లు 19 రకాలు ఉన్నట్టు గుర్తించారు. కోవిడ్ బారినపడి కోలుకున్నవారి శరీరంలో తయారవుతున్న యాంటీబాడీస్… మరోసారి కోవిడ్‌బారిన పడకుండా కాపాడేశక్తి యాంటీబాడీస్ సొంతం. అయితే యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణాలతో జన్యుపరివర్తనాలు (మ్యుటేషన్లు) జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్440కే రకంతో పాటు, యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే మరికొన్ని రకాల మ్యుటేషన్లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు.

Related posts