telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కల్తీ పాలతో.. కేన్సర్ కారకాలు.. జరభద్రం! .. : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

donot over heat packet milk

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని 6 శాతం కలుషిత పాల శాంపిళ్లలో కేన్సర్ కారకాలున్నాయని సర్వేలో వెల్లడించింది. దేశంలో సేకరించిన 6 శాతం పాల నమూనాల్లో కేన్సర్ వ్యాధి కారకమైన అఫ్లాటాక్సిన్ ఎం 1, కాలేయ విష సూక్ష్మ కలుషితాలున్నాయని పరీక్షల్లో తేలింది. దేశవ్యాప్తంగా 50వేలమంది జనాభా నివాసముంటున్న 1103 పట్టణాల నుంచి పాల శాంపిళ్లను పరీక్షించగా, అందులో 6,432 నమూనా పాలు తాగడానికి సురక్షితం కాదని రుజువైంది. దేశం మొత్తంమీద 7 శాతం పాల నమూనాలు తాగడానికి సురక్షితం కాదని తేలింది. 12 పాల నమూనాల్లో డిటర్జెంట్, యూరియాలు కలిపి కల్తీ చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈవో పవన్ అగర్వాల్ చెప్పారు.

పాలల్లో 0.5 పీపీఎం అనుమతించదగిన పరిమితికి మంచి అఫ్లాటాక్సిన్ ఎం1 అవశేషాలు తమిళనాడు, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఉందని వెల్లడైంది. కలుషితమైన పశుగ్రాసం వల్లనే పాలలో కేన్సర్ కారకాలు వస్తున్నాయని పరీక్షల్లో తేలింది. 1.2 శాతం పాల నమూనాల్లో పురుగుమందుల అవశేషాలున్నాయని వెల్లడైంది. పాల కాలుష్యానికి పురుగుమందుల అవశేషాలతోపాటు నిల్వ చేసిన దాణా కూడా కారణమని తేల్చినట్లు పాడి పరిశ్రమ నిపుణుడు కుల్దీప్ శర్మ చెప్పారు.

Related posts