వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లతో పూజా హెగ్డే చాలా బిజీగానే ఉంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత నుండి వాల్మీకి వరకూ అన్నీ క్రేజీ సినిమాలే. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఈ బ్యూటీ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా జాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ. అయితే ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించటంపై తన అనుభవాలను వెల్లడించింది. కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఓ పీరియాడిక్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే. మొహెంజొదారో పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాణి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హృతిక్‌తో లిప్‌లాక్ చేసింది ఈ బ్యూటీ. ఈ సన్నివేశం చిత్రీకరణకు సంబంధించి తన అనుభవాలను వెల్లడించింది. “ముద్దు సీన్స్ ఆడియన్స్‌కు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాల్లో నటించేందుకు తారలు ఎంతో ఇబ్బంది పడతారు. మొహెంజొదారో షూటింగ్ సమయంలో హృతిక్‌తో లిప్‌లాక్ ఉందని దర్శకుడు అశుతోష్ గోవరికర్ నాకు ముందే చెప్పారు. సీన్ ఇంపార్టెన్స్‌ను వివరించారు. నేను కూడా ఆ సీన్‌లో నటించేందు ప్రిపేర్ అయ్యా. కానీ తీరా షాట్ చిత్రీకరించే సమయంలో వణుకు వచ్చేసింది. గతంలో నేను ఎప్పుడూ అలాంటి సీన్స్ చేయలేదు. అందుకే చాలా ఇబ్బంది పడ్డా. షూటింగ్ సమయంలో చుట్టూ అంత మంది క్రూ ఉన్నప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సీన్స్‌లో నటించాలంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్” అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
previous post
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్