telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ : కేజ్రీవాల్

arvind-kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంచపడుతుందని, దాని మొదటి విడత పంపీణీలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మందికి ఇస్తామని అన్నారు. ఈ టీకాలు కేంద్ర ప్రియారిటీ కేటగిరీ వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రంచదేశాలలో దాదాపు 23లక్షల మంది కరోనా వ్యాక్సిన్‌ను అందుకున్నారని, మరి మన దేశం నంబరు ఎప్పుడు వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల కేంద్రాన్ని ప్రశించిన విషయం తెలిసిందే. అయితే దేశ రాజధానిలో వ్యాక్సిన్ పంపీణీ మొదటి విడతలో దాదాపు 51లక్షల మందికి పంచనున్నట్లు తెలిపారు. దీనిని ఇటీవల జరిగిన డిజిటల్ సమావేశం ద్వారా రాష్ట్ర సీఎం చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 74లక్షల వ్యాక్సిన్ డోసేజ్‌లను ఉంచేవిధంగా స్టోరేజ్‌ను సిద్దం చేసినట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వ చేసే సామర్థ్యాన్ని ఒక్క వారంలో దాదాపు 1.15కోట్లకు పెంచనున్నాం. అంతేకాకుండా ఎంచుకున్న 51లక్షల మంది ఫోన్ నంబరలకు ఎప్పుడు, ఎక్కడ వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలపనున్నామ’ని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రలో కరోనా బీభత్సం మరింతగా పెరిగిందని, అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కావలసిన వాటన్నింటిని సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు.

Related posts