telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎఫ్3 మూవీ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్…

అనిల్ రావిపుడి దర్శకత్వంలో 2018 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసి ఔరా అనిపించింది. దాంతో లాక్‌డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి ఎఫ్2కి సీక్వెల్ సిద్దం చేశాడు. దీనిని కూడా సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేశాడు. అందరూ ఓకే చెప్పడంతో ఈ సినిమాను ఎఫ్3 పేరుతో ప్రారంభించాడు. ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్. ఈ సినిమాను కుదిరినంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రీకరణను శరవేగంతో పూర్తి చేస్తున్నామని, చివరికీ వారంతాల్లో కూడా సెలవులే తీసుకోకుండా చేస్తున్నామన్నాడు. అంతేకాకుండా ఫన్‌కి సెలవులు ఉందవంటూ ఎఫ్3 సెట్స్‌ నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాత దిల్ రాజు, సునీల్ కలిసిన కూర్చుని ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా కొత్త తరహాలో ఉండబోతుందని, దీనిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

Related posts