telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దిశ ఎన్‌కౌంటర్” వివాదం… సైబర్ క్రైమ్ సీపీని ఆశ్రయించిన ‘దిశ’ తల్లిదండ్రులు

Disha

గత ఏడాది హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో దిశపై లైంగిక దాడి, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఈ ఘటనని ఆధారంగా చేసుకుని వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ “దిశ ఎన్‌కౌంటర్‌ ” అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాను ఈ నెల 26న విడుదలకానున్న విషయం తెలిసిందే. ‘దిశ’ ఘటన జరిగిన ఆ తేదీనే ఆ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను విడుదల చేశారు రాం గోపాల్‌ వర్మ. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆపాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిలిపేయాలని ఆమె తల్లిదండ్రులు ఈ రోజు సైబర్ క్రైమ్ సంయుక్త సీపీ అవినాశ్ మహంతిని ‘దిశ’ తల్లిదండ్రులు కలిశారు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమాని నిలిపి వేయాలని కోరుతూ ఆ కేసులోని నిందితుల కుటుంబ సభ్యులు కూడా నిన్న న్యాయ కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పోలీసుల ఎన్‌కౌంటర్‌తో హతమైన నిందితులు శివ, నవీన్‌, చెన్నకేశవులు, ఆరీఫ్‌ కుటుంబ సభ్యులు ఈ మేరకు న్యాయ కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు.

Related posts