సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక 3 లక్షల కోట్లు అదనపు భారం మోపారని… ప్రధాని మోడీని కలిసి కాళేశ్వరం కి జాతీయ హోదా కావాలని అడగడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయ్యింది… అధికారికంగా ప్రారంభించి ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్ కావాలని అంటున్నారు.. అసలు dpr సమర్పించావా..? అని ప్రశ్నించారు. Dpr సమర్పించకుండా జాతీయ ప్రాజెక్ట్ అడగడం ఏంటి..? కేసీఆర్ కమీషన్ల కక్కుర్తితో ఉన్నారని ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథ నీళ్లు…తాగు నీరు మినహా అన్నిటికి వాడుతున్నారని…
టీఆర్‌ఎస్ కార్యకర్తలన్నా తాగుతున్నారా..? అంటూ ఫైర్ అయ్యారు. ఒక్క ఎయిర్ పోర్ట్‌కే దిక్కులేదు కానీ… ఆరు ఎయిర్ పోర్టులంట… ముందు రోడ్ల కనెక్టవిటీ పెంచు… తర్వాత ఎయిర్ పోర్ట్ లు అంటూ మండిపడ్డారు. సిద్దిపేట, వరంగల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎయిర్ పోర్ట్ లు అంటున్నారని… పరేడ్ గ్రౌండ్ నుండి శామీర్ పేట వరకు ఎక్స్ ప్రెస్ హైవే ఏర్పాటు మీద దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ తో వచ్చిన దూరం తగ్గించుకునే పనీలో కేసీఆర్ పడ్డారని.. ఫెడరల్ ఫ్రెంట్ అని చెప్పిన కేసీఆర్… మోడీ ఫ్రెంట్ లో చేరాడని మండిపడ్డారు.
previous post
next post