telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముగిసిన తెరాస సమావేశం.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..

trs meeting by ktr on parliament sessions

కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈసమావేశంలో ఈ నెల 18 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. కాగా ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ , రాజ్యసభ ఎంపీలు హజరయ్యారు. కాగా పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ నియామకం అయిన తర్వాత మొదటి సారిగా ఆయన ఆధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావే కొనసాగడం విశేషం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేటీఆర్ గణాంకాలను ఎంపీలకు అందిచారు. వాటిని సాధించే అంశంపై దిశానిర్ధేశంన చేశారు. అందుకోసం ఇప్పటినుండే ఎంపీలు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణంపై కూడ సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

పార్టీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో వారికి వివరించారు.. ప్రధానంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, పథకాల కోసం పట్టుబట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన నిధులను రాబట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడి అయిదు సంవత్సరాలు అవుతున్నా… విభజన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండడంపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు పార్టీ ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని కేటీఆర్ కోరారు. ఈనేపథ్యంలోనే సమావేశంలో సుమారు ముప్పై అంశాలపై చర్చించినట్టు పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్ రావు తెలిపారు. వీటన్నింటిపై 20 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు.

Related posts