telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందేనా ?

Master

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు ఆంటోనీ శాంతను కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్‌, రీరికార్డింగ్‌, డబ్బింగ్‌ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం విడుదల కావాల్సి వుండగా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో రిలీజ్‌ కాలేక పోయింది. కాగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న విజయ్ సినిమా కోసం ఇప్పటికే అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా రావడానికి మరో ఆరు నెలల సమయం అయిన పట్టనుంది. ఇది నిజంగా విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే.

Related posts