telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ :… మెట్రోకు .. భారీగా ఆదాయం..

5.5 km metro corridor in patabasti

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలో మెట్రో రైలుకు ప్రయాణీకుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మహానగర ట్రాఫిక్ నుంచి బయటపడడానికి అన్ని వర్గాల ప్రజలు మెట్రో సర్వీసులను ఆదరిస్తున్నారు. దీంతో మెట్రో రైల్‌ ఖజానా కాసులతో గలగలలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులతో ఆదాయం భారీగా సమకూరుతోంది.

గతంతో పోలిస్తే గడిచిన నెలన్నరలో మెట్రోకు సుమారు 20 కోట్లకు పైగా అదనపు రాబడి లభించింది. రాయదుర్గం స్టేషన్‌, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాలు పూర్తయితే. రాబడి మరింత పెరిగే అవకాశముంది. ఈ నెలలో ప్రయాణికులు చాలా మంది మెట్రోకు అలవాటు కూడా పడిఉంటారు.. దీనితో ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రయాణ సమయం దృష్ట్యా ప్రజలు మెట్రోను ఆదరించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయని అధికారులు అంటున్నారు.

Related posts