telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ కేసులో 9 మందికి ఉరి… నలుగురికి జీవిత ఖైదు

దాదాపు ఐదేళ్ల కిందటి తేసులో నేడు సంచలన తీర్పు వెలువడింది. 21 మంది ప్రాణాలు తీసిన కల్తీ సంచలన తీర్పు వెలువరించింది బీహార్‌లోని స్పెషల్ ఎక్సైజ్ కోర్టు.. రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లో 2016లో కల్తీ మద్యం తాగి 21 మంది మృతిచెందిన కేసులో.. ఇవాళ తొమ్మిది మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన కోర్టు.. మ‌రో న‌లుగురు మ‌హిళా నిందితుల‌కు యావ‌జ్జీవ శిక్షను ఖరారు చేసింది. ఇక, యావజ్జీవ శిక్ష ప‌డిన మ‌హిళ‌ల‌కు 10 ల‌క్షల జ‌రిమానా కూడా విధించింది ఎక్సైజ్ కోర్టు.. కాగా, ఈ కేసులో ఫిబ్రవ‌రి 26వ తేదీన 13 మందిని దోషులుగా తేల్చిన స్పెషల్ ఎక్సైజ్ కోర్టు.. ఇవాళ శిక్షలు ఖరారు చేసింది.. వీరిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావడం సంచలనంగా మారింది. అయితే, 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్ లోని ఖ‌ర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన 21 మంది మృతిచెందారు.. పలువురు కంటి చూపును కూడా కోల్పోయారు.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు ఎస్‌ఐలు సహా 21 మంది పోలీసులను డిస్మిస్ కూడా చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ తీర్పు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. చాలా మంది ప్రజలు ఆ నలుగురికి కూడా ఉరి విధిస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related posts