telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ కు .. ఉపరాష్ట్రపతి హెచ్చరికలు..

Venkaiah-Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాక్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా భారత్ సంయమనంతో వ్యవహరిస్తోందని, ఈ మాటల దాడి ఇంకా కొనసాగితే మర్చిపోలేని విధంగా సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ పదవీ కాలంలోని రెండో సంవత్సరంలో చేసిన 95 ప్రసంగాలకు సంబంధించి సంకలనం చేసిన రిపబ్లికన్‌ ఎథిక్‌(వాల్యూమ్‌-2) అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ముద్రించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాంతియుతంగానే తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్‌ నిబద్ధతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఇంకా దురాక్రమణలకు పాల్పడుతూ రెచ్చగొడితే సహించదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. చరిత్రను చూసినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ఇతర దేశస్తులే భారతీయులను మోసం చేసి పాలించారు, కానీ భారతీయలు అలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదని అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి కూడా తన ప్రసంగాల్లో పొందుపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా
కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, థావర్‌ చంద్‌ గెహ్లాట్ పాల్గొన్నారు.

Related posts