telugu navyamedia
సినిమా వార్తలు

నీ కూతురికి ఇలాంటి ఘటన ఎదురైతే ఏం చేస్తావ్ ?… లైంగిక వేధింపులపై నటి ఫైర్

Revathy Sampath calls out actor Siddique for sexual harassment

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సిద్ధిఖీ మాలీవుడ్ లో నటీమణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన “ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్” (డబ్ల్యూసీసీ)ను విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన రేవతి అతడిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అంటే  2016లో తిరువనంతపురంలోని నీల థియేటర్ లో “సుఖమయిరికటే” సినిమా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు సిద్ధిఖీ తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు.

తనకు 21 ఏళ్ల  వయసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆయనకు కూడా తనలాంటి కూతురు ఉందని, ఇలాంటి సంఘటన నీ కూతురికి ఎదురైతే ఏం చేస్తారు మిస్టర్ సిద్ధిఖీ ? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూసీసీని విమర్శిస్తున్నారని, అసలు దానికి నువ్ అర్హుడివేనా..? అంటూ విరుచుకుపడింది. చిత్రపరిశ్రమలో నువ్ ఒక జెంటిల్మెన్ అని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయమంటూ ఘాటుగా స్పందించింది. రేవతి వ్యాఖ్యలు చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది పబ్లిసిటీ కోసమే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Related posts