telugu navyamedia
సినిమా వార్తలు

“రాధే శ్యామ్” నుంచి సర్‌ప్రైజ్‌ సాంగ్ రిలీజ్ ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Radhe Shyam Song Love Anthem: The teaser of Prabhas and Pooja Hegde's romantic track will be released tomorrow, see the new poster | Dailyindia.net

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

అందులో భాగంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఈ రాతలే ప్రోమోను రిలీజ్‌ చేసిన మేకర్స్‌ తాజాగా ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. సాంగ్ కి లిరిక్స్ కృష్ణకాంత్ అందించగా, యువన్ శంకర్ రాజా, హరిణి పాడారు.

Radhe Shyam trailer out: Prabhas, Pooja Hegde's love saga sure to tug at your heartstrings | WATCH | Regional-cinema News – India TV

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Related posts