హైదరాబాద్ ప్రజలపై కరోనా ప్రభావం ఎలా ఉందనే దానిపై సంచలన విషయాలు బయటపెట్టింది సీసీఎంబీ సర్వే. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారిలో… 54శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు ప్రకటించింది సీసీఎంబీ. 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75శాతం మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదని ప్రకటించారు శాస్త్రవేత్తలు. నగరంలోని 30 వార్డుల్లో 9 వేల మంది నమూనాలు పరిశీలించినట్టు చెప్పారు. భారత్ బయోటెక్ – ఎన్‌ఐఎన్‌తో కలిసి సీరో సర్వే చేసినట్టు సీసీఎంబీ తెలిపింది. కాగా… తెలంగాణలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 166 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,572 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,95,970 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,639 మంది మృతి చెందారు.
previous post
next post