సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మహేష్ తన కుటుంబంతో కలిసి ట్రిప్ కి వెళ్ళాడు. ట్రిప్ ముగుంచుకుని ఇంటికి చేరుకున్న మహేష్ తదుపరి షెడ్యూలుకు సిద్ధమవుతున్నాడట. గత షెడ్యూల్ నందు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో ఈ బురుజు దగ్గర జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయట. దసరా కానుకగా సరిలేరు టీం ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిలబడి ఉన్నాడు. అయితే ఆర్మీ ఆఫీసరుగా కనబడాల్సిన మహేష్ ఇలా గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడని అందరు అనుకున్నారు. అయితే కథలో ట్విస్ట్ అదేనట. బోర్డర్ లో గన్ పట్టుకుని పరుగెత్తాల్సిన మహేష్ గొడ్డలి పట్టడం వెనక పెద్ద కథే ఉందని అర్థం అవుతుంది. కథలో కూడా ఇదే కీలకమైన పాయింట్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడట. విడుదలైన తాజా పోస్టర్ లోని లుక్ తో సరిలేరు నీకెవ్వరూ మూవీలో ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయని అర్థం అవుతుంది. 2020 జనవరి 12న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.