telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” భరించలేని సినిమా… బాలీవుడ్ క్రిటిక్స్

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్‌ను రాబడుతోంది. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచ‌నాల న‌డుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అభిమానులని కూడా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింద‌నే టాక్ న‌డుస్తుంది. అయితే బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా సాహో చిత్రం భ‌రించ‌లేని సినిమా అని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాపై పెదవి విరుస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. అయితే ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్‌తో పాటుగా చిత్రానికి ల‌భించిన‌ హైప్‌, అడ్వాన్స్ బుక్సింగ్స్ వ‌లన తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 24.40 కోట్ల వ‌సూళ్ళు సాధించింద‌ని త‌ర‌ణ్ పేర్కొన్నారు. 2,3 రోజులు చిత్రానికి చాలా కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న తెలిపారు. సాహో చిత్రం తొలి రోజు హిందీలో 50 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు భావించిన‌ప్ప‌టికి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. 2019లో విడుద‌లైన చిత్రాల‌లో భార‌త్ చిత్రం తొలి రోజు 42.30 కోట్లు సాధించి టాప్‌లో నిలిచింది. ఆ త‌ర్వాత మిష‌న్ మంగ‌ళ్ ఫ‌స్ట్ డే రోజు 29.16 కోట్లు, సాహో 24.40 కోట్లు, క‌ళంక్ 21.60 కోట్లు, కేస‌రి 21.06 కోట్లు సాధించి 2,3,4,5 స్థానాల‌లో నిలిచాయి.

Related posts