telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్‌బాస్‌-3” విషయంలో జోక్యం చేసుకోలేము : హైకోర్టు

Bigg-Boss

బుల్లితెర బిగ్ రియాలిటీ షో స‌క్సెస్ ఫుల్‌గా ప‌దివారాలు పూర్తి చేసుకొని ప‌ద‌కొండో వారంలోకి అడుగుపెట్టింది. గ‌త వారం రవికృష్ణ బిగ్ బాస్ హౌజ్‌ని వీడ‌గా, ప్ర‌స్తుతం ఇంట్లో తొమ్మిదిమంది స‌భ్యులు ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఎన్నో వివాదాల మధ్య మొదలైన విషయం తెలిసిందే. తాజాగా “బిగ్‌బాస్‌-3” రియల్టీ షోను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. టీవీ షోలు ప్రజల భావ ప్రకటనకు సంబంధించిన అంశమని, వారి భావాలను ప్రకటించవద్దంటూ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వలేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. టీవీ షోల్లో అభ్యంతరాలు ఉంటే ట్రాయ్‌కి ఫిర్యాదు చేయవచ్చని ధర్మాసనం సూచించింది. పిల్లలు చూడకుండా నియంత్రించాల్సింది వారి తల్లిదండ్రులేనని తెలిపింది. బిగ్‌బాస్‌ షోల్లో అసభ్యకర, అనైతిక సన్నివేశాలను సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని, యువతను చెడుమార్గం వైపు తీసుకెళ్లే ఇలాంటి ప్రసారాలను నిలుపుదల చేయాలని పిటిషనర్‌ కోరారు.

Related posts